పాటుపడక సుంతైనను
మాటల మాయల జనులను మభ్య పరచినన్
చేటగు కార్యము లెల్లం
బాటుబడిన, వారి కెట్లు ఫలితము దక్కున్? 31
సుంత దెలియ బెద్దయనంగ వింత గాను
జంకు గొంకు లేకను వెట్ట వంక లెన్నొ
వారి వీరి మేర లెఱుగ నేర కుండ
విఱ్ఱవీగెడి వారలే? విజ్ఞు లనఁగ. 30
ప్రీతిగ పంచ సమములకు
నేతలె యెన్నికల వేళ నిఖిలాన్వయ సం
జాతుల మతార్థముం దమ
చేతం జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్. 29
క్రూరులు ధన మోహ మద వికారుల చెలి
మి నత డక్కట దారుణ మిత్ర వంచి
తుండు శిక్షితుడైన నిర్దోషికి యురి
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవసముఁడు. 28
భోగ భాగ్యములకు పుట్టి నిల్లట యది
సంతతి కఱవయ్యె సుదతి కకట
కాళి మాత గుడిని కాంచన ఛదమునం
గప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచె. 27
కమలాప్త కరోష్ణ తపన
సమధిక తప్తాతి ఘోర సమయము లందున్
విమలము మేఘచ్యుత తో
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్. 26
జీవ నావసర ధనము క్షేమ కరమె
యధికమైన విభవము చౌర్య భయ దుఃఖకరము నిత్యము సకలాఘ కారకములు
కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు. 25
కాటి కాపరి యయ్యె నిక్ష్వాకు వంశ
వర్ధనుండు సద్ధర్మ భూభర్త యకట
దారుణంబుగ నిక శని దాపు రింప
వల్లకాటిలోఁ దిరుగు శ్రీవల్లభుండు. 24
చెంగు చెంగున గంతులు భంగ మైన
భామ కంత కాలు బెణికె నేమొ యయ్య
రో కలికి కాలు జాఱె తె మ్మాకుమందు. 23
న్నాగమ సార తుల్య దురితౌఘ వినాశము భవ్యదాయియున్
రాగ సమేత సుందరము రామ సునామ రసామృతమ్ము నుం
ద్రాగిన వాని జీవితము ధన్య తరమ్ము ధరా తలమ్మునన్ 22
రిమితముగు గాక వ్యయమొనరింపగం, గృ
పారసము మది ప్రసరింపఁ, బాప ఫలము
వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల 21
చాపు మెడను మేక, ఘోరచపలత్వము సం
తాపమసహనమున మెలగఁ
జేపలు గాకులకు బుద్ధి చెప్పగఁ దరమా
[చేపు, అలుగు, ఆకులకు, బుద్ధి చెప్పగఁ దరమా] 20
తగదది జనుల కనిశమ్ము దగ నించుక శాం
త గుణము, కోపమది నా
పగ, గల్గిన వాడె సౌఖ్యవంతుడు జగతిన్ 19
పగ మూడు భవము లందున
దగు భక్తి నయిదిట ముక్తిఁ దరియింతు రనన్
పగ నెంచిరి జయవిజయలు
పగ గల్గిన వాడె సౌఖ్యవంతుడు జగతిన్ 18
చెఱచుఁ గార్యములను శీఘ్ర మనవ
రతము వ్యర్ధములునిరవధిక కోప తా
పాల వలన వైరమే లభించు 17
తా మరి ఖర దూషణాది దనుజుల కెల్లన్
రామాస్త్ర హత ఖరుడు, రా
కా మాతురుడైన నరుడె? కాంచును ముక్తిన్
[నరుడె: కాదు రాక్షసుడు; రాక: విశ్రవసుని భార్య] 16
గద్రక్షకు డచ్యుతుండు కరుణా మయుడున్
భద్రగతి నుండు జగతిని
భద్రాచల రాముడుండు బాసర యందున్ 15
సలిలమ్మంచు నెంచుచుం గుడువ నుత్సాహమ్ముగన్ మద్యమున్
చలి వేంద్రమ్ములలోన బోసెదరు విస్తారమ్ముగా, మద్యమున్
బలవంతమ్ముగ గాంతు సత్వరము భీభత్సమ్ము దీపింపగన్
[మత్ + యమున్ = మద్యమున్] 14
నరాధములు నిజసతులను నరకవ్యథలం
గురి సేయుట ఘోర దురిత
మరణము లేనట్టి వాడె మర్త్యు డన దగున్
[దురితము+అరణము] 13
బట్నమునకు దనదు పల్లె నుండి
ముచ్చట గను నంత ముగ్గుర దన తల్లి
తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె. 12
ధనార్జ నైకైక లక్ష్య తప్తాత్మునకున్
జనపతుల లక్షలం దని
పినవానికిఁ జూడ రెండువే లొకలెక్కా? 11
“లెక్కలబిస” యనియు నందు రక్కజముగ
అప్పు జేసి దర్పముగను గొప్ప జూప
కూటి కేడ్చెడువాఁడును గొనెనుదాని
[కూటి కేడ్చెడువాఁడు కంప్యూటరుఁ గొనె.] 10
దండ చేకొని మామిడి పండు తినుచు
పండు వెన్నెలనిండారియుండ భళిర
మండు వేసవిఁ గ్రమ్మెను మంచుతెరలు. 9
ఘన మోహాంధులు కుమతులు కరుణా హీనుల్
ధన ధాన్య లుబ్ధ మత్సర
జనగణ బాధాకరము వసంతము వచ్చెన్. 8
రీశ్వరముగ జన్న మెట్లు సేయు
వింత సుమి పిలువని పేరంట మది పరా
త్పర సతీ గమనము బాగు బాగు. 7
హదంచి తానురతి పెద్దలం దుంచక కిం
చిదగౌరవమ్ము సుఖముగ
నిదురించెడువాఁడు ధారుణిన్ యశమందున్. 6
విధి వంచిత నరు లనాథ విహ్వల మతు లి
వ్విధి బాధించిన దుష్టుల
నధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్. 5
భూసు రోత్తము డుదయము భాసురముగ
యవన రాజ నగర గమ నాభి లాషి
చర్చిలో, సంధ్యవార్చెను, సాయబయ్య. 4
వ్రాసె మనోజ్ఞకావ్యములు వ్యాకరణమ్ము నెఱుంగ డింతయున్
దాసుడు కాళిమాతకు సుదైన్యుడు మందుడు ముందు నారయన్
వాసిగ రాజకన్యను వివాహము వంచన నాడి ఖిన్నుడై
భాసిత పండితుండయినఁ బన్నుగ కొల్వగఁ గాళికాసతిన్ 3
చెఱకు, రసము మిగుల చేదు సుమ్ము
దుష్ట క్రిముల నెల్ల నష్ట పఱచు వేగఁ
బండ్లు తోముట కది పాడి సుమ్ము 2
భర్త ప్రాణముల నొసంగె పడతి కతని
వరమునన్ సాళ్వ భావి ధవ యననొప్పు
భర్త జీవించి యుండు సువర్తనమున 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి