అసితాజిర విలసితులు వి
కసితాంభోజ వదన మదగజ సుగమన భా
ను సితాంశు వీక్షణులు నీ
ర సిక్త రమణులఁ గనుడు వర కలమ మందున్ 48
సర్వ సంగ పరిత్యాగు లుర్వి సర్వ
భూత హిత రతాత్ములు నవధూత వరులు
దీన జన పోషణార్థమ, దానఁ గాక
వ్యర్థ , మొనరింపఁ దగును సంపదల బుధులు. 47
దుష్టజనసేవ, రక్షణ దుఃఖితులకు,
గర్వహీనత, యమర లోక విలసితులు
క్రమమునఁగుదురీ క్రింది చక్కని పదములు
వ్యర్థ, మొనరింపఁ దగును, సంపదల, బుధులు. 46
దార సుతాది పోషణకుఁ దాల్మి ధనార్జన సమ్మతమ్మిలన్
కసితాంభోజ వదన మదగజ సుగమన భా
ను సితాంశు వీక్షణులు నీ
ర సిక్త రమణులఁ గనుడు వర కలమ మందున్ 48
భూత హిత రతాత్ములు నవధూత వరులు
దీన జన పోషణార్థమ, దానఁ గాక
వ్యర్థ , మొనరింపఁ దగును సంపదల బుధులు. 47
దుష్టజనసేవ, రక్షణ దుఃఖితులకు,
గర్వహీనత, యమర లోక విలసితులు
క్రమమునఁగుదురీ క్రింది చక్కని పదములు
వ్యర్థ, మొనరింపఁ దగును, సంపదల, బుధులు. 46
దూరము గాక ధర్మగతి దుష్టులఁ జేరక వీడి తన్వహం
కారము లోభ మోహ మద కామ రుషాదిగ దుర్గుణౌఘ సం
హారము కోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయఁగాఁ దగున్ 45
ఘన సమస్యలకు విఘాతమె సుమి
చక్కగ నొనరించు చర్చల సమసిన
పోరు వలన శాంతిఁ బొందగలము. 44
క్రన్ననఁ బుట్టి యా రుచికిఁ గన్నుల విందుగ పెండ్లి యాడగ
న్నన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశి యౌ
నన్న నసత్యభాషణమె యా యుగళమ్మిల నిత్యపూజ్యమే 43
చిన్న కులమ్ము ధన మదియు
సున్న చదువు లున్న నేమి సుందరి వినుమా
మన్నన కాదని యెవరే
మన్నను బతిగాఁ గొనెఁ జెలియ యదృష్టమునన్ 42
ములను నెఱపి యుక్తాయుక్తములు నెఱి దల
చకను దమలోన తాము రోసి కలహించు
ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు 41
సుజనతఁ జూపని వైద్యులు
ధ్వజవర్ధన సేయ లేని వాహిని గరిమన్
నిజము నుడువ సోమరులౌ
ప్రజలు నిరోధకు లఁట మన ప్రగతికి నెపుడున్ 40
బురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ
త్వ రతికి సుమంగళికి నా
దరింప దగును మన భారత సుసంస్కృతినిన్ 39
పరువము నందు భాసిలెడు భామ సుదంతి సుదీర్ఘ కేశియుం
గరమరు దైన రూపవతి కన్పడ, భక్తి నుతించి వేగ నా
పురుషునిఁ, బెండ్లియాడె నొక పూరుషుఁ డందఱు మెచ్చి యౌననన్ 38
[ పురుషుని = పరమాత్మను]
చిరకాలము జీవింపగఁ
బరమప్రీతిం దలుపక భవ దోషమునున్
వరగుణవతిఁ, గూతురు కా
పురుషునిఁ, బెండ్లాడె నొక్క పురుషుం డౌరా 37
తాపము తాళ జాలక సదార సుతాకలితుండు పాఱగం
గోపము వూని శాత్రవ నిగూఢ విచార దళౌఘ భీమ సే
నాపతి యేగుదెంచఁ గని నా పతి భీతిని నక్కె నొక్కెడన్ 36
ఏ పగిది తీర్తు రుణమని
చూపడు ముఖము తనకు, పతి సుదతి సృజనకుం,
బాపము భవనమ్మున సృజ
నాపతి చనుదేరఁ జూచి నా పతి నక్కెన్ 35
మానము ప్రాణమన్న చిఱుమన్నన లేక వధింప నేర్తురే
దానవ భావమున్ విడిచి దౌష్ట్యపు టిక్కలి కాలమందు దే
వా! నరు లెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో 34
ధాన్యము లెంచకయె శారదా దేవిని స
న్మాన్యుండు రామకృష్ణకు
సన్యాసికిఁ బిల్ల నిచ్చి సంబరపడియెన్ 33
జాతుడు రాఘవుండు శివ చాప సుభంగము సేసి వేగ భూ
జాత విరాజమాన తను ఛాయ జితాంబుజ దేవి జానకీ
మాతను బెండ్లియాడి జనమాన్యుఁడుగా నుతి కెక్కె మిత్రమా! 32
వీతపతిని బుచ్చెమ్మను
బాతక మనక విధవా వివాహ నిచయ సం
ధాత గిరీశమ్మట, విను
మా, తను బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్ 31
మాత్రపు సత్కృపారస నిమగ్న సమీక్షణ లేక యున్న స
త్పాత్రుడు నిత్య సత్య ధృత భాషితు డా యమనందనుండు నే
శత్రువు లేనివాని, కిల శాంతి సుఖంబులు గల్గనేర్చునే 30
కంటి లోపల నలుసును గాలి ముల్లు
శ్రవణమున నున్న జోరీగ జనుని సరణి
తలుప సత్య మిది ధరణీ తలమున జిత
శత్రురహితున కబ్బునే శాంతి సుఖము 29
బమ్మెర పోతన్న వ్రాసె, వ్యాకరణమ్ము
న్నిమ్ముగ చిన్నయ సూరియ
సమ్మోదమ్మున రచించె సంశయ మేలా 28
మమ్ములఁ బోలు సంధులు సమాస విశేషము లందజేయ నా
సమ్మత దివ్య భాగవత సత్కృత కావ్యమునందుచక్కగన్
బమ్మెర పోతనార్యుఁ డొక వ్యాకరణమ్మును వ్రాసెఁ దెల్గునన్ 27
భూజనునకు రాజునాజ్ఞ భూరిక్షయమున్
వే జరుగుట తథ్యంబే
సౌజన్యుండైన నేమి సంకట మందున్ 26
కునకు చిన్నవి కలయామెకుఁ బతి తనని
చేరి కని వారలందునఁ జిన్నదాని
యమ్మ కాతఁడు మగఁడయ్యె నక్కజముగ 25
పీన మయూఖజ ఘనోష్ణ వృష్టిన్ ధాత్రిన్
భానుండు చెలగి తాఁ బరు
వాన కురియు నెండు గడ్డివామున్ వేగన్ 24
ఛవిమత్కంకణ కాంచనాభరణ వస్త్రశ్రేణి భాసింపగన్
స్తవనీయంబుగ నాదు రాణుల ననున్ శాసింపు శాతోదరీ
యవనీజాతను జూచి తాఁ బలికె మోహావేశ మగ్నుండహో
నవనీతమ్మఁట రావణాసురు సుకన్యాసక్తచిత్తం బిలన్ 23
అవమానము సేయక గౌ
రవమును జూపవలయు నికరమ్ముగ, వేగం
బ విడిచి మన లోపలి దా
నవ నీతము రావణుని, మనము స్త్రీల యెడన్ 22
[దానవ నీతము = రాక్షసుల(దుష్టుల) చే తేబడిన (ప్రేరేపింప బడిన);
రావణుని = తెలిసిన మూఢుని లేక హింసకుని]
యుట్టిగఁ దిరిగెదవు పట్టి యూరేలు మతిం
గట్టా పేరాససుమీ
పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్ 21
దబ్బున నిబ్బరము నబ్బఁ దబ్బిబ్బగుచుం
బ్రబ్బిన పబ్బము గబ్బవ
జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్. 20
అబ్బాయి యేగి పట్నము
మబ్బులు గ్రమ్మి కురిసిన గమక వర్షమునం
దబ్బురముగ నాడి తడువ
జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్. 19
విక్రముడు వితథుని జన్మ విదితము గాదే?
సక్రమమే వ్యాస భవము?
నక్రమ సంతానులును మహాత్ములు గారే? 18
చక్రి పదాంబుజ రత ని
ర్వక్రప్రహ్లాద సహిత పాలిత ధరణీ
చక్ర వినుత దైత్య విదూ
రాక్రమ సంతానులును మహాత్ములు గారే? 17
చందన చర్చితాంగ ఘన సన్నిభ నీల సులక్షణాంగ గో
వింద పరాత్పరా పరమ భీషణ మార్గణకోటి ఘాతి నే
చందము నైన నాకు నుపశాంతిని వేగమ యేను భీష్ముడన్ 16
[మార్గణకోటి=బాణాగ్రము]
త్రోవం దప్పి చరించినఁ
బ్రోవగ రావే యిభహర పురుషశ్రేష్టా
దేవారాధ్య సులక్షణ
తావక శరకోటిఘాత దనుజానీకా 15
సారాతిని నింద సేసి యభయమ్ముగ దూ
తేరాపరాఙ్ముఖివియై
పోరాటపుఁ గామి వైతి పోగాలమునన్ 14
[దూత+ఇరా+పరాఙ్ముఖివి; ఇర = మాట, ]
దు జిగురు కరగింప దానిఁ దోరముగ ఘనో
ష్ణజ సుద్రవమ్ము వారి య
గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్ 13
[అగజము= జిగురు; ఖరము=వేడి]
భజన పరులు తనుఁ బొగడగ
సుజనులు పాండు తనయులఁ గసుగు నిత్యంబుం
గుజనుండట కౌరవది
గ్గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్ 12
రోతన్వర్తిలు కారణమ్మున వెసన్ లోకైక శూరున్ జగ
త్త్రాతన్ భర్తగఁ బొంది తీవు మరి యీప్రాణక్షయం బేలనో
సీతా! రాముని కోగుఁ జేయఁ దగునే చింతింప నిల్లాలివై 11
మారీచుడు రావణునికి చెప్పిన హితవు:
భ్రాతలు పుత్రులు మిత్ర
వ్రాతము దారలు బలగము రాజ్యము తోడం
బ్రీతిఁ జిరము మన నెంచిన
సీతా రామునికిఁ గీడుఁ జేయం దగునే 10
వీరావేశము మానసమ్మునఁ బొరిం బేట్రేగఁ గోపమ్మునన్
పారావారపరీతభూవలయముం బంధించి, స్వప్నంబునన్,
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా దిగ్దంతు లల్లాడఁగన్ 9
ఈ రీతి వినగ నోపునె
వీరత నొక యీగ దగ్గె విన్నిలఁ గూలన్
పారగ భూతము లన్నియు
ధీరత నొక దోమ తుమ్మె దిక్కరు లడలన్ 8
త్రాత దయామయుండు శతధాముడు పూర్వ భవాత్త పుణ్య సం
జాతము భక్త కోటికి నొసంగును సౌఖ్య నికాయ మందుకే
యాతఁడు శంకరుండు పరమాత్ముఁడు మాధవుఁడై వెలింగెడిన్ 7
సర్వ లోకైక పాలకు డుర్వి భర్త
కృష్ణుడు సహిష్ణుడు మురారి కేశవుండు,
నెవని నాభిని నుదయించె నింపుగం బు
డతఁడు శంభుఁడు, మాధవుఁడై వెలుంగు 6
[ శంభుఁడు=బ్రహ్మ]
శుక్తం బింపుగ నారగింప పరితోషుండంత నిత్యం బధో
భక్తంబున్ వెసఁ ద్రాగ తామ్ర సమమౌ వర్ణంపు ద్రవ్యంబునున్
రక్తం బంచును నిర్మలోదకములం ద్రావంగ భీతిల్లెఁ దాన్ 5
[ శుక్తము = మాంసము; అధోభక్తము=భోజనము చేసిన పిమ్మట త్రావు నీరు,
మందు మొ. ; ద్రవ్యము = మందు]
నిత్య సందేహి మనలేడు సత్య మిదియ
యెంచి పీడ కలలు నిదురించ వెఱచు
గరళమని యెంచి యశనము కతుక వెఱచు
రక్త మని నిర్మలాంబువుల్ ద్రాగ వెఱచు 4
దండ సురక్షా వినోద! తలతు నిరతముం
బండరి నాథా! చిత్తం
బెండ నఘచయ ఘన వహ్ని నేనొరు నెఱుఁగన్ 3
ధ్వంసం బింపుగఁ జేసి శ్రీహరినిఁ దా బ్రార్థింపగా నోపు వి
ద్వాంసుల్ సత్కృత యజ్ఞయాగముల, నిర్వక్రంబుగం జెప్పరే,
మాంసాహారముఁ గోరి కోరి తినినన్ మాన్యుండు విప్రుం డగున్ 2
దంసనములఁ జెరచును బ్ర
ద్వంసము సేయంగ నేల వంశము శాకో
త్తంసము భోజనము రహిత
మాంసముఁ దిన విప్రవరుఁడు మాన్యుం డగురా 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి