29, జులై 2016, శుక్రవారం

పద్యాలు_జులై 2016

కాననములో గళగళ పారుతున్న  సెలయేటి చిత్ర వర్ణన:
ఊర్జిత నగ షండ భరిత
నిర్జన వన నిర్విరామ నిర్ఝర ధారా
గర్జన నిస్వన ఘనసం
తర్జిత మృగ విహగ హీన తరళ సరసియే                                       1

బహు కష్టము తెలిసి పలుక
బహుళమ్మగు నత్వసంధి బ్రహ్మకు  నైనన్  
విహరించు నిష్ట గతినిఁ గ
లహ కారణము కవులకు నిలఁ దరింపుహరీ!                                                 2 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి