1, జులై 2016, శుక్రవారం

పద్యాలు_జూన్ 2016


తరువోజ:
కన్నడ రాయడు కమనీయ మనెను గౌరవమిచ్చి జగమునఁ దెనుగును
మన్నన కెక్కిన మనసున్న ద్రవిడ మధుర కవీశుడు మన్నించె తెనుగుఁ
గ్రన్నన నిటలీ పురనివాసి తలచె రమ్యపు నిజభాష రతినిఁ దెనుగును
నెన్నడు మన్నించు నింపుగ తెలుగు నిద్ధర మనవాడు నెరుగంగ రాదు             3

గోమాత తోడు రాగన్
గోముగ నూసులు వలికెడు కూనల తోడన్
సామూహిక యానము గన
నా మది యుప్పొంగె ననియన ననృతమగునే                                                 2

చిత్రముగ బాల లచ్చట
ఛత్రము చేవూని వాన జల్లులఁ గనుచున్
మిత్రు లిరువు రింక బడికిఁ
బాత్రతఁ బడయం గదిలిరి పరమప్రీతిన్                                                              1


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి