జగ జెట్టి పోరునందుఁ బి
డుగు సుమ్మీ యేల నీ గడుసు దన మిఁక నీ
కు గురు వతఁడు మది నెంచక
పగ వానికి దాసుఁడగుటె పౌరుషము గదా 61
గగ నాకారులు నీ ఖరాదు లట సంగ్రామంబునం జచ్చిరే
వగలాడిన్ విని మంచి చెడ్డల నిటన్ భావింప కింతైననుం
దగునే నీకు హరించ రామసతి సీతన్ సోఁకుపెన్మూఁకకుం
బగవానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా 60
ప్రాగ్దేశాంతర వాసు లు
దగ్దే శావాసులు నిరతము వెండియు ప్ర
త్యగ్దేశు లడుగుదు రిటులు
వాగ్దేవినిఁ గొల్చువాఁడు పండితుఁ డగునా 59
ధిగ్దోషావృత నిత్య శంకిత మనో ధీరా మహా మానవా
ప్రాగ్దిక్భూతుఁడ విన్ము తీరుఁ ద్రుటి దుష్పాత్రంపు సందేహమే
వాగ్దోహాభిష వార్ద్ర చిత్త జని తాపార ప్రతోషమ్మునన్
వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్ పాండిత్యమబ్బున్ సఖా 58
అన్న మూల మయ్య యవనీ తలమ్మని
యన్న మాట నరయ సన్న మగునె
యాధునికము మఱియు నద్భుతం బైన ర
సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు 57
[రసవతి = వంట యిల్లు]
వివశులఁ జేసి శత్రువులు పీడ లొసంగఁగ శాంతి యుండునే
కవియఁగ నింటఁ దస్కర నికాయము దాచిన కాసు లుండునే
వివరము లున్న భాండమునఁ బేయము లక్కటఁ ద్రాగ నిల్చునే
సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే? 56
చిందఱ వందఱ వస్తువు
లెందెందు గనిన వనజదళేక్షణ దిగులుం
బొందకుమీ యుందువు నీ
వం దనమో తల్లి యనిన వధియింపఁ దగున్ 55
[నీవు + అందు +అనము +ఓ = నీ వం దనమో]
కందుము పెద్ద లందఱినిఁ గన్పడ లేవఁగ నేల నిత్యమున్
మందుల భంగిఁ గావలదె మానిని పెద్దరికమ్ము మా కనన్
దుందుడు కుండ నిత్యమును దుష్టుని బుద్ధినిఁ, జేయకుండు మీ
వందన మమ్మరో యనఁ గృపామతిఁ జూడక చంపఁగాఁ దగున్ 54
పారాశ రాది సన్ముని
వారము స్తుతియించ రాజ పర్వం బెల్లన్
ఘోర జన దమను లీ దను
జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే 53
వారని నిత్య దేశ పరిపాలక వర్గ విధాయ కోత్క రా
ధార సమేత చిత్తమునఁ దత్పరులై సతముం జరించెడిన్
ధీర పరాక్రమ ప్రబల ధీయుత చారుత రాప్రమత్తపుం
జార కళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్ 52
[అప్రమత్తము + చార కళావతంసులకు = అప్రమత్తపుం జార కళావతంసులకు]
ఋణములు వడిఁ బొందెడు కా
రణమునఁ బరదేశ మండలమ్మున కకటా
ఫణముగఁ బెట్టిన భద్రత
గణతంత్ర దినోత్సవమునఁ గలఁతలు రేఁగున్ 51
విలువలు ముఖ్యమం చనుచు వేఱుగఁ గాంచ జనాళి నెన్నడుం
దలపడ రాజ కోటి కిల ధర్మము కాదని నొక్కి చెప్పుచుం
జెలఁగఁగఁ బౌరసత్వ పరిశీలన శాసన మందు మార్పికన్
గలఁతలు రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్ 50
ఈ యంబుధిఁ ద్రచ్ఛంగను
గాయమ్ము లలయఁగఁ బుట్టెఁ గట్టా దీనిన్
వే యీశ్వరుం దలఁచి, మన
యాయుర్వృద్ధికి, నిడఁదగు హాలాహలమున్ 49
కాయప్రాప్తపు రోగ సంతతినిఁ జక్కం జేయ సామర్థ్యమే
యోయీ యీ విష మందుఁ గాఁగ మఱి సంయోగమ్ము సామ్యంపు దో
షాయాత్తంబయినన్ శరీరమున నీషణ్మాత్ర మీ మందునే
యాయుర్వృద్ధికి రోగి కీయఁగఁ దగున్ హాలాహలంబున్ వడిన్ 48
చెండుం దుఱిమి సిగ పయిన్
బెండలు గిండ లన రోఁత బింబాధరమే
యుండంగఁ గాంచ మెఱసెడు
పండుగ నాఁడు పలికె సతి వండ నటంచున్ 47
ఒండొరు లేమి పండు గని యూరక పల్కుచు వత్తు రెల్లరుం
గండలు లేవు వండ నిట కాయము నందుఁ గనంగ దండిగన్
మెండుగ బంధు మిత్ర తతి మించి చొరంబడ భీత చిత్తయై
పండుగనాఁడు వండనని భామ వచించెను గచ్చితమ్ముగా 46
పుంస్కాహంకృతి భారత
సంస్కృతియే కాదు కాంచ శాతోదరి యీ
సంస్కంధ మెఱుఁగమే యీ
సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్ 45
[సంస్కంధము = ఒక రోగము)
సంస్కృత్యం బగు దేశమే మనది సస్యశ్యామలం బెన్నడుం
బుంస్కర్మాశయ బద్ధ మీ భవము సంపూర్ణమ్ముగా నమ్ముఁడీ
పుంస్కామా జన సంచయమ్ము తిరుగం బోనాడ లేనట్టి దు
స్సంస్కారం బిసుమంత లేని నరుఁడే సత్పూరుషుండై మనున్ 44
[సంస్కృత్యము = సంస్కరింపఁబడినది; పుంస్కర్మాశయము = పురాకృత
కర్మ గుణములు (వాసనలు); పుంస్కామ = పురుషులను కోరు స్త్రీ,
ఇక్కడ వెలయాలు]
ఎంచ భరియించు వాఁ డగు నెన్నఁ డేని
భర్త తాళి కట్టిన నేమి ఫలము దలఁచఁ
గొంచె మైనను భార్యఁ బోషించ లేని
పతి యనఁగ నర్థమిడె సతి వ్యర్థుఁ డనుచు 43
తత గృహ వాస సంచలిత దార తిరస్కృత భర్త లోభ పూ
రిత హృద యాగ్ర్య ఋక్తపతి రిక్త జలాప్పతి నాఁగ నాథులన్
సతత విలాస భోగ రతి సంగత భూపతి ధర్మహీన ధీ
పతి యన నర్థముం దెలిపె వ్యర్థుఁ డటంచును ధర్మపత్నియే 42
విందీయ వెలఁది మండలి
చిందులు వేయుచు నఱచుచుఁ జెవు లవియంగా
నందంద దొర్లుచు నకట
కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్ 41
రాకల్ పోకలు మాను మింక నిజ మిత్రప్రస్త్య సంచారముల్
లేకున్నం గట కల్గు నింద లవి దుర్భేద్యమ్ములై నిత్యమున్
రాకాచంద్ర నిభాస్య! కన్గొనుమ యేలన్ రావు వేవేగ న
బ్బా కందుల్ విలపింపఁగన్ గలఁగిరే భామామణుల్ వేదనన్ 40
మర్మము నుడువును హైందవ
ధర్మము మోక్ష పథమునకుఁ దత్పరులైనన్
దుర్మద పాషండ మతపు,
ధార్మిక! రీతుల నెఱుఁగని ధన్యులము గదా 39
కర్మ ఫలాశ ముక్త నర కాయము వొందదు కర్మబంధమున్
నిర్మల బుద్ధిఁ జేయవలె నిత్యము మెండుగ దానధర్మముల్
నిర్మమకార సంయుత వినిశ్చయ సన్మతి వేదబాహ్య దు
ర్ధార్మిక రీతులన్ విడిచి ధన్యత నందిన వార మైతిమే 38
[ఫలాశ = ఫలమను నగ్ని / ఫలమను నన్నము]
సడలరు నయ తర్కమ్ముల
నడరెదరు సమస్త విద్య లందు వినయులై
బుడుగుల మందురు పొగడిన
నెడపక బొంకెదరు రాణ్మహేంద్ర పురజనుల్ 37
ఉలుకరు దుఃఖ సంచయము లుబ్బిన ధైర్యము వీడి యెన్నఁడున్
నిలుపరు స్వీయ చిత్తముల నేర్పున ధర్మ విరుద్ధ వాచ్యముల్
కలిగిన నిత్యశోక జనక ప్రబ లాలపనమ్ము లెంచఁగాఁ
బలుకరు రాణ్మహేంద్ర పుర వాసులు సత్యము నెన్నడేనియున్ 36
హృద్రోగార్దిత జనులకు
నిద్రయె వరమై చెలంగు నీరేజాక్షీ
భద్రమ్ముగ మితిమీఱని
నిద్రాసక్తులకు దక్కు నిఖిల విభవముల్ 35
హృదయము నందు నిల్పి సత మింపుగఁ గొల్చుచు భక్తి శ్రీరమా
పదయుగ చింతనా రతత బ్రహ్మ ముహూర్తము నందు లేవఁగా
సదమల రీతిఁ బంచదశ శౌరి కృపా ఘటికా మితంబుగా
నిదురను మున్గువారలకు నిశ్చల సంపద లబ్బు నెన్నఁగాన్ 34
[పంచదశ ఘటికలు = ఆఱు గంటలు]
పంకజ ముఖియే వండఁగ
సంకటములు తీరు నింక శంక లుడుగుమా
వంకర మాటే యగు నిది
వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా 33
తంకా హీనము వీత కార్యముల నిత్యంబుండి మోహాంధతన్
శంకం జెందక యన్న పానము లిఁకం జాలించి రేయింబవల్,
కంకాళమ్మయి, దోర దోరగను వేఁగన్ ముంచి మద్యంబులో
వంకాయన్ గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే భ్రష్టుం డగున్ వేగమే 32
ప్రిథ్వి భోగి మంటలు మండ విరివి వచ్చు
నందముగ భోగి సంక్రాంతి ముందు దినము
కనుము పండుగ సంక్రాంతి చనిన దినమ
కనుమ నీకనుమానమా కనుమ కనుమ 31
విన యాగర్వ మనఃప్రవృత్తినిఁ దగన్వేఁడంగ లక్ష్మీధవా
ధన ధాన్యాదులు వేఁడ నెన్నడును నీ దాక్షిణ్యమే కావలెం
గనకున్నారు సమస్త దేవతలు నిష్కామాత్ము నీ వేని నం
గనుమా నీ కనుమానమా కనుమ నన్గాంచంగ జా గేలనో 30
స కార నిషిద్ధ సంక్రాంతి వర్ణనము:
గగన భాగం బెల్లఁ గప్పుకొనంగ నరుణ కాంతులు దనరి మణి నిభమ్ము
జనలోక మెల్ల హర్ష జలధి మునుగంగఁ బంట లంద భృశము తొంటి యట్ల
జలరాశు లెల్లయుఁ జారుతరమ్ములై నిండంగ నెల్లెడ మెండుగాను
నిజ తనూభవ కమనీయ కాంతుల నిజకాంతునిఁ గూడి రా గంతు లిడుచుఁ
జలి పులి కులికి చలిమంట చెలఁగ నింట
వడివడిఁ దడబడక నెడఁ బరుగు లిడుచుఁ
గనుడు కను డంచు ననుచుండ దినకరుండు
మించి వచ్చెను మకరంపు మంచి క్రాంతి 29
చుట్టు ప్రక్కల నిండ్ల నున్నట్టి వారు
బిట్టు రట్టులఁ దిట్టుచుఁ జుట్టు ముట్టఁ
గట్టె లుండ వక్కట నింట నెట్టు లింక
భోగి యనినంత జనులకుఁ బుట్టు భయము 28
సాగర సప్త వేష్టిత విశాల ధరాతల పాల నోత్థి తా
వేగ మనో ప్రవృత్తి జన భీకర కార్య వితాన తప్తులై
రాగ విహీన సంతత విలాస విలగ్న ధరేశుఁ డా మహా
భోగి యనంగనే భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్ 27
పెట్ట వలెనన్న నుత్పత్తి వేశ్మ తతులు
యంత్ర చాలన మ్మింక భృత్య సముపార్జ
నమ్ము పాలక జన సమ్మతమ్ము లనఁగఁ
బురిటి నొప్పులు తప్పవు పూరుషులకు 26
వరమై యొప్పును మాతృ భావ మిల సంభావ్యమ్ము సంసార సా
గర లబ్ధోత్తమ రత్న రాజములు నిక్కంబీ శరీరోద్భవుల్
తరుణీ రత్నము లం,గ జార్దిత మనస్తా పార్తులై చేరఁగాఁ
బురుషుల్ పొందెద రెప్పుడున్ బురిటి నొప్పుల్ దప్ప దీ భూమిపై 25
నిఖిల జగత్కంటకుఁడు వి
ముఖుఁడు సదుపదేశములకుఁ బుత్తడి దిండిన్
మఖవిధ్వంసునిఁ గాంచఁగ
సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్ 24
మఖ కార్యానిశ మగ్న చిత్త వర సన్మౌనీంద్ర శాపాహ తో
న్ముఖ దుష్టాలికి ధాత్రి సౌఖ్యతతికిన్ నోచంగ నెట్లౌనయా
యఖిలైశ్వర్య మదాంధ కాయమున కాహా నేడు ధ్వస్తావలీ
సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్ 23
ఆకాశవాణి వారి సమస్య:
సందేహించఁగ నేలఁ జాటుఁ గద శాస్త్రంబుల్ నిజేశుండు పే
రొందుం బన్నుగ దేవుఁ డంచు సతికిన్ యోషా మతల్లీ ధరన్
వందార్హున్ హృదయంబు నన్నిలుప నీ ప్రాణేశు నంచద్గు ణా
నిందారోపణముల్ హితమ్ము లొసఁగున్ నీరేజ పత్రేక్షణా 22
[గుణ +అనిం దారోపణముల్ = గు ణానిం దారోపణముల్]
శ్రీకృష్ణుని సత్యభామా లాలనము:
సుందర వదనా సత్యా
కుందఁగ నేల లలితాంగి కోప ముడుగుమా
యంద మయిన నీ నోటన్
నిందారోపములు హితమునే యొసఁగుఁ జెలీ 21
సందీప్తమ్ముగ వ్రాసి యుంచినను విస్తారంబుగా సత్సుధీ
బృందా రాంచిత గ్రంథ రాజమున గంభీరమ్ముగాఁ జూడఁగా
నందందుండగ నర్థ దోషములు కావ్యాంతర్గతస్రస్త స
న్నిందారోపణముల్ హితమ్ము లొసఁగున్ నీరేజ పత్రేక్షణా 20
నరుల కెంచ నగును మిత్ర నాశనమ్ము
బ్రహ్మచారుల కగు ఘోర పాతకమ్ము
మోక్ష కాములకు నగుఁ బుణ్యక్షయమ్ము
దుఃఖమే కూర్చుఁ గాదె వధూటి రతము 19
దోః ఖన నావట మ్మగును దుశ్చరితమ్ములు పూడ్చఁ దన్నిఁకన్
దుః ఖుర శస్త్ర సంయుత సుదుస్సహ రోష మదాంధ మైన ప్రా
తః ఖర పాద తాడన వితాన విచార సమాన మందు నీ
దుఃఖము గాదె చక్కని వధూటి రతంబు విదగ్ధకోటికిన్ 18
[వధూటి = కోడలు]
క్రమ్మును వేశ్మముల విచా
రమ్ములు పెల్లుగ నిరంతరమ్ము తలఁచుమా
యెమ్మెయి నైనను మానిన
సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్ 17
రమ్మివి చూడు మిత్రమ కరమ్ముపయుక్తము లెల్ల కార్ష కా
యమ్మున కిందు సందియ మయా వల దెట్టిది నన్ను నమ్ముమా
యిమ్ముగ యంత్రరాజముల, నిట్టివి, కోరఁగ నాకు రామదా
సమ్మెలె, సాధనమ్ములు నిజమ్ముగ దేశపురోభివృద్ధికిన్ 16
[రామదాసు +అమ్మెలె = రామదా సమ్మెలె]
తూఱిరి కొందరు గృహముల
దూఱుచు ధాతను గరమ్ము తోచక బుద్ధిన్
మీఱఁగ దుష్టపుఁ బ్రాసయె
పాఱిరి గద పూరణ మన వరకవు లెల్లన్ 15
దారుణ మైన వార్త నవదాన్య ధరేశు నెఱింగి రంత రాఁ
గోరఁగఁ జక్రవర్తిఁ దమ గోరిక లింపుగ నౌర లే విలన్
మేరలు రాజశాసనము మీఱఁగ శక్యమె విత్త పేటికా
పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బాఱి రంతటన్ 14
పరజన మాన హరణముం
బర విత్తాపహరణమ్ము వద్దుర మోడ్తుం
గర యుగ్మ మిట్లనకు మా
పర కాంతాసక్తుల కగు వరసంపత్తుల్ 13
[అనకుము +ఆపర = అనకు మాపర]
వరలక్ష్మీ సతి లోకమాత నిడె సత్పాత్రంబుగా నెమ్మిఁ దా
నరవిందాక్షుఁడు వక్ష మందు మఱి దేహార్ధంబులో నింకయున్
శిరమం దుంచెను శంకరుండు సతులన్ స్వీయాంతరంగస్థి తా
పర కాంతారతులైన వారలకు సంపత్సిద్ధి గాకుండునే 12
[స్థిత +అపర =స్థి తాపర; అపరము = ఇతరము కానిది, స్వీయము]
విదితం బియ్యది దేశ దేశముల సంప్రీతిం బ్రజామోద మై
నది సర్వోత్తమమై చెలంగు భువి మాన్యంబై సుశాస్త్రంబులన్
గదితం బింపుగ నేత దుత్సవ బృహత్కార్యంపు టారంభమున్
ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్, ముక్కోటి యేకాదశిన్ 11
[ముక్కోటి యేకాదశిన్ = ముక్కోటి యేకాదశియందు]
వారమునకు నొక్క వాసర మీవలె
నెవ్వ రేని సెలవు నొవ్వు చుండి
చేయుచుంటిఁ జేయఁ జేయఁ గడచి పోయె
నాది! వారమె సెల వంద దేల? 10
చీఁకటి క్రమ్మి నంతటనె శీఘ్రమ నిద్దుర వోవు నంగముల్
వీఁకను గొంతు నిండఁగను వెఱ్ఱిగఁ గ్రుక్కుచు మెక్కి వింత గా
నీ కడు పిట్టు లెప్పుడు సహించుచు నీండ్రము లుండ న్యాయమే
నా కిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో 9
పాతాళ తలాతల సు మ
హాతల సు వి తల రసాత లాతల తీరా
తీ తాశ్చర్యమ్ములు భూ
నూతన సంవత్సరఁపు వినోదము లేలా 8
ఏ తరి నైన హర్షము లహీనముగా విరియంగ మానవ
వ్రాతము సేయ నొప్పుఁ గద పండుగ లింపుగ నేకమై యిలన్
ధాతృ పరంపరాగత విధాన విశేష విహీన రాశియౌ
నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో? 7
కలవర మేల హృదయముల
లలితంపు జనుల మతమ్మె రంజిలు నిచటం
గలుషాంతరంగపు జనుల
విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్ 6
పలల మనోహ రాశన సుపర్వ రిపూత్కర ధర్మ సమ్మత
మ్ములు పరదార నిగ్రహ విమోచన కర్మము లంచు నెంచుచున్
నలినజ వంశ సంభవ ఘనప్రవ రాధిప సంస దాధిలో
విలువలు మృగ్యమౌటఁ గని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్ 5
[ఆధి = చోటు, (వ్యసనము నిందార్థము)
సింహ శార్దూల జంతు రాశి చరియింపఁ
బంట పండఁగ వాటికిఁ గంటఁ బడఁగ
నా క్షణంబ నిశ్శంకగ భక్షణంపుఁ
గలిమి గలుఁగు వసించినఁ గాననమున 4
సలలిత మానసం బలరఁ జక్కఁగఁ జేయుచు దైవచింతనల్
కలవర మింత యేని మదిఁ గానక యానుచుఁ గందమూలముల్
పలలము మాని సంతతము ప్రాఁజదువుల్ వెలయించు చుండఁ బ్రాఁ
గలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానల కేఁగి వసించు వారికిన్ 3

ఎంతును గావడి కుండలె
యంతటఁ గష్ట సుఖము లని యట్లయినం గొం
డంతలు సుఖములు వెత లా
వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్ 2
వింతగ నెంత వారికిని భిన్న మొనర్చఁగఁ గాలచక్రమున్
సుంతయు శక్యమే పరమ శూలికి నైనను దమ్మిచూలికిన్
సంతత హర్ష సౌఖ్యము లొసంగి శుభావళి నింకఁ , దేర్చుచున్
వంతల, నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి