శంకరాభరణము సంచిక.
(మెతుకు సీమ సాహితీ సాంస్కృతిక సంస్థ కొఱకు)
ఆంధ్రభాషా
క్షేత్ర కృషీవలుఁడు.
|
||
శా.
|
నిత్యంబుండి విశిష్ట వృత్తిఁ దగ సస్నేహమ్ము సద్విద్య వే
ప్రత్యక్షమ్మయి యొజ్జగా నొసఁగుచుం బాలించి విద్యార్థులం
జైత్యవ్రాత విలగ్న మానసమునం జక్రాయుధుం గొల్చుచున్
సత్యంబైన పథమ్ము నెంచితివి భాషాక్షేత్ర
సద్ధాలికా!
|
1.
|
శా.
|
విజ్ఞానాస్పద శంకరాభరణ సత్పీఠమ్ము స్థాపించి భా
షా జ్ఞానమ్ము నొసంగుచుం దమి సమస్యాపాద దత్తుండవై
ప్ర్రజ్ఞా పాటవ దక్షతం బెనుచ సభ్యశ్రేణికిం బ్రీతినిన్
సజ్జ్ఞానమ్ము సెలంగు చుంటి విల భాషాక్షేత్ర
సద్ధాలికా!
|
2.
|
శా.
|
అంతేవాసులు దేశ దేశముల నారాధింత్రు కంద్యగ్రణీ
ప్రాంతాతీతము పండితార్య! విబుధుల్ బంధుత్వ మాశింత్రు నీ
చెంతన్ నిల్చుచు సుప్రసన్నముఖ! సచ్ఛీలవ్రతా! శంకరా!
శాంతస్వాంత! మురారి గాచు నిను భాషాక్షేత్ర సద్ధాలికా!
|
3.
|
శా.
|
స్వాంతం బెన్నఁడు నిర్మలమ్ము నయి సత్సౌఖ్యాబ్ధినిం దేలగా
నంతర్యామి యశేష మీయఁగను నిత్యం బాయు రారోగ్యముల్
సంతానమ్ము మహాభివృద్ధిఁ గన విశ్వంబందుఁ గంద్యన్వయా
సంతోషమ్ముగఁ గందు జీవనము భాషాక్షేత్ర సద్ధాలికా!
|
4.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి