పరమేశా
త్రిశతి.
పంచ
పద్య ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.
|
పరమేశ. |
సిత గాత్ర విమల
భస్మ చిన్మయ రూపా!
నత మౌని గణ
సురాలి నాథ వ రార్చ్యా!
విత తాఘ చయ విదూర
పింగళ నేత్రా!
యతి రాణ్నుత
మము గావుమా పరమేశా!
|
1. |
|
|
|
|
|
పరమేశ. |
గత కల్మష హృదిఁ గొల్తుఁ గల్మష కంఠా!
నతు లిత్తును నిరతమ్ము నర్తన లోలా!
గతి నీవ జగతి లోనఁ గామ వినాశా!
యతి రాణ్నుత మము గావుమా పరమేశా!
|
2. |
|
|
|
|
|
పరమేశ.
|
సతు లిద్దఱు తను వందుఁ జంద్రధరేశా! మితి లేని కరుణ నీది మృత్యు విజేతా! కృతు లిచ్చి తమి నుతింతుఁ గింకర రీతిన్ యతి రాణ్నుత మము గావుమా పరమేశా! |
3. |
|
|
|
|
|
పరమేశ. |
సతి నుంచితి తల పైన సవ్యము నందున్
పతితమ్ము విషము కంఠ భాగము నందున్
రతి నుంచితి హరిణాంకుఁ రమ్యపు మౌళిన్
యతి రాణ్నుత మము గావుమా పరమేశా!
|
4. |
|
|
|
|
|
పరమేశ. |
అతి తీక్ష్ణపు టసమాక్షి యంగజుఁ గాల్చెన్
వ్రత మూనితివి కపాల పంక్తి ధరింపం
బితృ మందిరము ఘనంపు వేశ్మము నీకున్
యతి రాణ్నుత మము గావుమా పరమేశా!
|
5. |
14/2/2021.
పరమేశ వృత్తము: స న జ భ గగ ; యతి 10 వ
యక్షరము. ప్రాస కలదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి