అనంత వాణీ శతకము
పంచ పద్య ప్రణీతము: పోచిరాజు కామేశ్వర
రావు.
|
శంకరాభరణ
వృత్తము |
శ్రీ
సరోజ వరాస నాత్మశ్రీ రాజ్ఞి! విద్యైక నేత్రీ! శ్రీ
సరాక్ష శుక ప్రభా నాళీ కేద్ధ పుస్తైక హస్తా! భాసురానన!
కాశ్యపేయ వ్రాతార్చితాంఘ్రి ద్వయాబ్జా! హాస
భాసిత సన్ముఖీ! నిన్నర్చింతు సద్భక్తి వాణీ! |
1.
|
|
|
|
|
|
శంకరాభరణ వృత్తము |
వాస మింపుగ సత్య లోక ప్రాంతంపు
ధామమ్ము దేవీ! బాస లన్నియు సంతతమ్మున్ భాసిల్లు నీ
నోట మాతా! వాస వాది సురాళి నిన్నంబా కొల్త్రు
నిత్యమ్ము భక్తిన్ హాస భాసిత సన్ముఖీ! నిన్నర్చింతు
సద్భక్తి వాణీ! |
2.
|
|
|
|
|
|
శంకరాభరణ వృత్తము |
ఆస బాసర కేఁగి బ్రాహ్మీ! యర్చింత్రు
నేర్వంగ విద్యల్ వాసి కెక్కితి భారతీ! విశ్వం బందు
నిందుండి ప్రీతిన్ నీ సముల్ కలరే ధరిత్రిన్ నీరేజ
పత్రాభ నేత్రా! హాస భాసిత సన్ముఖీ! నిన్నర్చింతు
సద్భక్తి వాణీ! |
3.
|
|
|
|
|
|
శంకరాభరణ వృత్తము |
భాసురం బగు నీదు వీణా వాద్యమ్ము
విశ్వమ్ము లోనం ద్రాస మెల్ల నశించు వేడం దల్లీ మదిన్
నిన్ను నిత్యం బో సరస్వతి! భారతీ! నీ వుండంగ
డెందమ్ము నందున్ హాస భాసిత సన్ముఖీ! నిన్నర్చింతు
సద్భక్తి వాణీ! |
4.
|
|
|
|
|
|
శంకరాభరణ వృత్తము |
భాసు రాబ్ధిజ పన్నగేం ద్రాభ
క్షీర రత్నాక రాంభో జాసమాన
తుషార మందా రాకుప్య శైలేంద్ర ఫేన వ్యాస కాశ మరాళ కుందా భాకార పద్మాయ తాక్షీ
హాస భాసిత సన్ముఖీ! నిన్నర్చింతు
సద్భక్తి వాణీ! |
5.
|
శంకరాభరణ వృత్తము - గణములు ... ర-స-య-త-త-గగ. 10వ అక్షరము యతి, ప్రాస నియమము కలదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి