|
సమ్మక్క సారక్క దేవతాద్వయ స్తుతి. |
||
|
|
||
|
తే.గీ. |
శ్రీ రమా గిరి జాంశ విశేష మహిమ సంజనిత విత తామేయ శక్తి యుక్త దేవతా మతల్లు లయిరి గావ మాన వాలి సమ్మక్క! సారక్క! లనఁగ మీరు |
1. |
|
|
|
|
|
తే.గీ. |
మానవత్వము గనరాదు మాన్య లార! రాక్షసత్వము మితి మీఱె రమణు లార! ధరణి దయ లేదు నేఁడు సుంత జగదంబ లార! సమ్మక్క! సారక్క! రార ప్రోవ |
2. |
|
|
|
|
|
తే.గీ. |
నీతి నియమమ్ము లన్నవి నేల రాలె హింస సెలరేఁగె శాంతమ్ము ధ్వంస
మయ్యె నిజము కఱవాయె వెదకంగ జగదంబ లార! సమ్మక్క! సారక్క! రార ప్రోవ |
3. |
|
|
|
|
|
ఉ. |
తూలఁగ భోగ భాగ్యములఁ దోరము కొందఱు
భాగ్యవంతులై మూలుగు చుందు రాఁకలిని భూజను
లన్యులు మూరి సంతతం బాలము లుండ విశ్వమున నాయము లక్కట
మానవాలికిం జాలవు కూడు గుడ్డలకు సమ్మక! సారక!
రార కావఁగన్ |
4. |
|
|
|
|
|
చం. |
తఱ చయి స్వార్థ చింతనము తద్ద
చెలంగెను మర్త్య కోటిలోఁ దఱిఁగెను ధర్మ వర్తనము దాంతము
శాంతము మిక్కుటమ్ముగన్ వెఱపు నశించెఁ బాపముల విత్త నిమిత్తపు
టాశ రేఁగెఁ గ్ర చ్చఱఁ గరు ణాంతరంగముల సమ్మక!
సారక! రార కావఁగన్ |
5. |
|
|
|
|
|
మ. |
అనురాగమ్ములు సన్నగిల్లినవి
కోపావేశ మాత్సర్యముల్ దనరెన్ మిక్కుటమై కలిం నరులకున్
ధాత్రీతలం బం దహో కనమే భద్రత మానినీ మణులకుం
గామాంధు లుండంగ స జ్జన కోటిం గరుణార్ద్ర దృష్టిఁ
గనరా సమ్మక్క సారక్కలూ |
6. |
|
|
|
|
|
కం. |
మ్రొక్కెద మింపుగ మీరే దిక్కిల శరణాగతులము దీవింపఁగ రా రక్కలు సమ్మక్కరొ సా రక్కరొ విశ్వమ్ము నింక
రక్షింపంగన్ |
7. |
ప్రబల రచనా ధురంధర | నిబిడీ కృత మోద భరిత నిర్మల చిత్తున్ || స్తబక నిభ కవన చయ రత | విబుధ వర విధేయ సత్కవి జనాసక్తున్ ||
8, జూన్ 2024, శనివారం
సమ్మక్క సారక్క దేవతాద్వయ స్తుతి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి