శ్రీరస్తు. శుభమస్తు. అవిఘ్నమస్తు.
26 -05-2024.
శ్రీ పద్మాశ్రీనివాసుల పుత్రికామణి హర్షిణీ భరత నాట్య
సభారోహణోత్సవ శుభ సందర్భమున నర్తకీమణికి శ్రేయోభిలాషి యాంధ్రభాషానేక కావ్య కర్త పోచిరాజు కామేశ్వర
రావు సమర్పించు శుభాశీః పద్య రత్నాక్షతలు:
***
మత్తకోకిల.
అంబికాసతి
తాండవేశ్వరుఁ డాదరమ్మునఁ గాంచఁగా
నంబ
శారద నీకు దీవన లంచితమ్ముల నీయఁగా
నంబుజాసన
నిత్య ముండఁగ నండగా నొనరింపుమీ
యంబరమ్మును
దాఁక నృత్యము హర్ష వర్ధని! హర్షిణీ!
చంపకమాల.
ఘుమఘుమ
చంద నాగరు సుగుంఫన వాసన లీను సత్సభన్
సమ
సమ హస్త కాంగిక దశా విలసన్నిజ భావ జాలముల్
క్రమముగఁ
బర్వ లోచన విరాజిత నృత్య మొనర్పు హర్షిణీ!
ధిమి
ధిమి పాద ఘోషణ వితీర్ణ దిశా దశ మండలోద్ధతిన్
కందము.
భావి
భరత నాట్య కళా
కోవిదవై
వెల్గుమీ యకుంఠిత దీక్షన్
దైవకృపాన్విత!
హర్షిణి!
వావిరి
కీర్తి గడియించి వర్ధిలు మమ్మా!
సర్వమంగళాని
భవంతు!
స్వస్తి!
***
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి