పితృదేవ స్మరణము
(శ్రీ పోచిరాజు పేర్రాజు నామధేయ సంకీర్తనము)
|
శా. |
శ్రీ లక్ష్మీ సతి నాథు కూర్మిసుత సచ్ఛీ లాన్వ యాంభోధికిం ద్రైలోక్యాధిపుఁడై వెలుంగు హరు మూర్ధావాసునిం బోలుచున్ మేలౌ కౌశిక గోత్రుఁడై బుధ జనా మేయాభిమానుండునై వేలా హీనము పోచిరాజ వనధిన్ వెల్గొందె పేర్రాజనన్ |
1. |
|
|
|
|
|
కం. |
కరివరద పదస్మృతి త త్పరమతి విమల గుణధామ పావన పేర్రా జ రుచిర నామమున వెలుఁగు విరాజమాన సురభరిత పితృలోకమునన్ |
2. |
|
|
|
|
|
మ. |
తరణార్థంబు భవాబ్ధి వ్రాసితివి గీతాసార భాష్యమ్మునున్ విరియం జేసితి పుష్ప సంచయము సావిత్రీ కథాగమ్మునం బర భాషామృత భాండ మిచ్చితివి వప్తా సంయమీంద్రత్వమున్ వరమై యొప్పగ నిన్ను గొల్చెదము నీ పాదద్వయం బానుచున్ |
3. |
|
|
|
|
|
మ. |
నర వంద్యోత్తమ సేద దీరితి శివానందద్రుమచ్ఛాయలన్ దరిఁ జేరంగఁ దలంచి వింటి వట సత్యానంద సద్బోధలం బరమానందము నొందవే రమణ దేవజ్యోత్స్నధామంబునన్ సరి లేరెవ్వరు నీకుఁ దండ్రి యిల సంసారంపు సన్యాసివే |
4. |
|
|
|
|
|
ఉ. |
మాన ధనుండు గ్రామ జన మండిత తత్త్వ విశోధకుండు స త్సూనృత గీతసార పరిశోధిత
మానస భాసమానుఁడున్ మానిత వేద సూక్త పరిమాణ మహోదయ కావ్య రాజ సం ధానుఁడు సత్యవంత వర దార చరిత్ర మనంగ ధాత్రినిన్ |
5. |
|
|
|
|
|
శా. |
సత్యాధ్యాత్మిక చింతనా కలిత భాస్వద్జ్ఞాన సంభావ్యుఁడున్ నిత్యోద్దీపిత పద్య కీర్తిత మహానీలాంగ విష్ణుండు నౌ న్నత్యభ్రాజిత వర్తనుండు స్వపురీ నాథత్వ ధౌరేయుఁ డా రాత్యామ్నాయ విహీనునిం గొలుతుఁ బేర్రాజాఖ్య విఖ్యాతునిన్ |
6. |
|
|
|
|
|
ఉ. |
దొడ్డవరంబు నాఁ బరఁగు దొడ్డ పురమ్ము సలీలఁ గాచి తీ వడ్డము లేని చందమున వ్యర్థపుఁ బల్కుల సంహరించుచున్ దుడ్డున కీక విస్తరము దోరపు గడ్డగు కాల మందునన్ గొడ్డము లెన్ని వచ్చినను గుండె దిటమ్మున నుంటి విద్ధరన్ |
7. |
|
|
|
|
|
ఉ. |
ఫల్గు దురంత కార్యచయ భంజన! చిత్తము నందు స్వార్థమే కల్గ నెఱుంగ వీ వెపుడుఁ గామ మదోద్ధృత ఖాండ వాటవీ ఫల్గుణ! బంధు మిత్ర జన వర్గ సమంచిత పూజ్య పూరుషా! వెల్గితి వీవు దొడ్డవర వీర్య జనప్రవ రాధి నేతవై |
8. |
|
|
|
|
|
మ. |
శత వర్షంబులు గాంచఁ జాగినను మా స్వాంతమ్ము లందుండు నీ దు తలంపుల్ నెఱి నింపుఁ జిత్తముల సంతోషామృతద్రోణి నీ వితతస్ఫూర్తి వచో నికాయ మొసఁగున్ విజ్ఞాన విత్తమ్ములం బితృలోకాంతర వాస! మమ్ముఁ గరుణన్ వీక్షించి దీవింపుమా! |
9. |
|
|
|
|
|
మ. |
జననం బంది సు కౌశి కాన్వయమునన్ సద్బ్రాహ్మణజ్యోత్స్నఁ జి ద్ధన రాజత్కపిలేశ్వరాఖ్య పురి విద్యాశుద్ధ చేతస్కుఁడై మనమం దెన్నఁడు విష్ణు నామ రతి నే మాత్రమ్ము క్షీణింప నే రని వృత్తమ్మున గ్రామపాలకుఁడు బేర్రాజాఖ్య జీవించెనే |
10. |
|
|
|
|
|
మ. |
చిరకాలమ్ము సనాతనార్ష గుణ సంశ్లేషైక సన్మానసుం బర మార్థాతత శోధనార్థ పరితప్తస్వాంత సంచారినిన్ గురు సేవానుగ తాఖిలాంచిత మహా గుప్తార్థ విజ్ఞానినిన్ దరహాసాస్య విరాజమాన జనకున్ ధాతాభునిం దల్చెదన్ |
11. |
|
|
|
|
|
శా. |
శ్రీకృష్ణార్పిత నిర్మ లాతిశయ చిచ్చేతో మహాంభోధికిన్ రాకా పూర్ణ సుధాకరుండ వయి భార్యా పుత్ర బంధమ్ముతో నేకాంతస్థిర భావ మగ్నుఁడవు విశ్వేశున్ మదిన్ నిల్పి ని త్యైకాగ్రస్ఫుట రక్తి నుంటి విట సత్యాకాంక్షఁ దండ్రీ
మహిన్ |
12. |
|
|
|
|
|
మ. |
భగవద్జ్ఞాన వికాస సంభరిత సుస్వాం తారవిందప్రభా! విగ తాంతర్గత వైరి షడ్గణ! మహా వేదాంత విద్యా ప్రవీ ణ గరిష్ఠా! విమ లాంతరంగ! నుత కృష్ణస్తోత్ర పారాయణా! సుగుణభ్రాజిత పోచిరాజ కుల సుశ్లోకైక రత్నాంకురా! |
13. |
|
|
|
|
|
మ. |
కమనీ యోజ్జ్వల సద్గు ణావృత లసత్కారుణ్య పాథోనిధీ! విమ లాంతఃకరణప్రదీప్త చరితా! వేదాంత విద్యోన్నతా! రమణీ యామల పోచిరాజ కుల పారావార తారాధిపా! కొమరుం డింపుగ నీయ భక్తిమెయిఁ గైకొమ్మా నమో వాక్కులన్ |
14. |
|
|
|
|
|
శా. |
జ్యేష్ఠాత్మోద్భవ నల్లు నింకను ద్వితీయేద్ధాత్మజన్ భర్తనున్ శ్రేష్ఠుండైన కనిష్ఠు నల్లుఁ దమి సచ్ఛీలుం జతుర్థున్ లస త్కాష్ఠాంగార విరాజమానునిగ నాకర్షించితే యల్లునిన్ నిష్ఠం దండ్రి స్నుషన్ ద్వితీయ నణఁపన్నిత్యేహ కష్టమ్ములన్ |
15. |
|
|
|
|
|
ఉ. |
సాత్యవతేయు భంగి నిల సాత్యవతేయుఁడ వీవు నెన్నఁగా సత్య గవేషణా రతిని సంతత ముంటివి నిశ్చలమ్ముగాఁ గృత్యము లందుఁ గ్రుంగక స్వకీయ మనమ్మును నిల్పి చేసితే యత్యయ పంక్తి నో జనక యార్తి వహింపక యోర్చి వెల్గితే |
16. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి