21, డిసెంబర్ 2025, ఆదివారం

Homage to R K Sing



సీ. రామ కిషోర సింహామల నామ సత్కార్య దురంధర గణ్యుఁ డఖిల 
భారత పరమాణు భవ్యత రోద్యోగ సహకార సదన సంచయ విశాల
నిర్మాణ సంస్థకుఁ గర్మాధికారియై విజయమ్ము సాధించి వినుతి కెక్కె 
కార్య దీక్షా రత కారణ జన్ముండు మను జోపకార సన్మానసుండు 


తే.గీ. ని పురమునకు మూల స్థంభ మయ్యె 
లలిత వృత్తికి భాసిల్లె లక్షణముగ 
గెలిచి జనుల మానసములు కీర్తి వడసె 
భువిని వెలసిన వర పుణ్య పురుషుఁ డతఁడు                                                                          2. 

సీ.  ధరలోన జన్మించి పరమ దంపతులకు దివ్యంపు బీహారు దేశ మందు 
నరుదైన భాగ్య నగరములో నొనరించి యింపైన యుద్యోగ మెసక మెసఁగఁ 
బరివారమున కెల్ల భవనమ్ములను గట్టి యలవోక విభజించి యందఁ జేసి 
రాజధాని కరిగి రమ్య సేవ లొసఁగి మాతృభూమి ఋణము ప్రీతిఁ దీర్చి 

ఆ.వె. పుడమి లోనఁ బనులు తడయక పూరించి 
నాక లోక మందు రాక కెదురు
చూచు చుండ నెల్ల సురలు వారి కొసఁగ 
ముదము వీడితె మము పుణ్య పురుష1                                                                                 1. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి