శ్రీరస్తు. శుభమస్తు. అవిఘ్నమస్తు.
25-02-2026.
శ్రీమ
దివటూరి మాధురీ వేంకటరమణల పుత్రికామణి జాహ్నవీ అర్చిత వివాహ మహోత్సవ శుభ సందర్భమున నర్చితా సాయి సురేంద్ర వధూవరులకు
నాంధ్రభాషానేక కావ్య కర్త పోచిరాజు కామేశ్వర
రావు సమర్పించు శుభాశీః పద్య రత్నాక్షతలు:
***
కారణ కార ణాఖ్యుఁడు
జగన్నుత దేవ గణాధి నాథుఁ డా
మార హరుండు
శ్రీగళుఁ డుమాపతి భక్త జనౌఘ పాత కా
హార గుణాబ్ధి పావనత
మార్చిత సాయి సురేంద్ర యుక్త నిం
పారఁగ నర్చితార్చిత
పదాంబురుహద్వయి గాచుఁ గావుతన్
[కారణకార ణేశ్వరుఁడు
లోక నుతుఁడు దేవ దేవుఁడు మద నాంతకుఁడు పార్వతీ పతి భక్త జనుల పాపములను హరించు
గుణవంతులలో సముద్రుని వంటివాఁడు నర్చిత చే నర్చింపఁబడిన పద్మములను బోలు పాద ద్వయము
గల వాఁడు పుణ్యాత్మురా లయిన యర్చితను
సాయిసురేంద్రుని తోడుత రక్షించును గాక!]
నిండుగ నూర్వసంతములు
నెమ్మి శరీరము నందు డెందమం
దుండఁగఁ బుత్ర పౌత్ర
సహి తోన్నత వంశ విభూతి వర్ధిలన్
మెండుగ నుండ బాంధవ
సమృద్ధి ధ నామిత ధాన్య భూ లస
న్మండన వాహ నావసధ
మండలి మందురు గాక! దంపతుల్
సర్వమంగళాని భవంతు!
స్వస్తి!
***
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి