శ్రీరస్తు.
శుభమస్తు. అవిఘ్నమస్తు.
28-06-2026.
శ్రీ యఱ్ఱమిల్లి
హూణ విజయ నాగరాజ శర్మ శివపార్వతీ దంపతుల నాశీర్వదించుచు వారి పుత్రికామణి భవానీ
సాయి వల్లీ దేవీ వివాహ మహోత్సవ శుభ
సందర్భమున భవానీ సాయి వల్లీ దేవీ వేంకట సాయి ప్రసన్న కుమార్ వధూవరులకు
నాంధ్రభాషానేక కావ్య కర్త పోచిరాజు కామేశ్వర
రావు సమర్పించు శుభాశీః పద్య రత్నాక్షతలు:
***
నిరవద్యమ్ములు కామితమ్ములు భవానీ సాయి వల్లీ సతిన్
హరుఁడున్ సాయిని స ప్రసన్న స కుమారాఖ్యున్ వధూద్వోఢలన్
నిరతం బేర్పడఁ గాంచి కావుత రమా నీరేజ పత్రాక్షులుం
బరఁగన్ నిత్యము విత్త వాహన వసువ్రాతప్రమోదమ్ములున్
క్రమ
ధారాయుత పుత్ర పౌత్ర వర పారంపర్య మేపారఁగా
విమలాంతఃకరణమ్ము
లిర్వురను సంవేష్టించి వర్ధిల్లెడిం
బ్రమదోపేత
నిరంతరాతిశయ దాంపత్యమ్ము దీపించెడిన్
భ్రమరాంబా నటరాజ
దీవనలు సంప్రాప్తమ్ములై కావుతన్
తగు నీ సాధ్వి భవాని సాయికిని నీతండుం దగున్ లేమకుం
దగులం జేసిన పద్మ
సంభవుఁ డహో ధన్యుండు కాకుండునే
తగులం బత్యధికంబ
యిర్వురకు నిత్యం బుండు నన్యోన్యమై
తెగ దీ బంధము ధాత్రి
నెన్నఁడును వే దీవింప నాకౌకసుల్
సర్వమంగళాని భవంతు!
స్వస్తి!
***
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి