6, సెప్టెంబర్ 2015, ఆదివారం

పద్యరచన

బాలుడొకండతి నేర్పున
చేలంచెంతన నిలబడ చిచ్చర పిడుగై
బేలగ  బిలబిల  నేత్రులు
మేలెంచి యెగసి నిలిచిరి  మేటి తరులపై                                                        5

యదుకుల తిలకిందీవర శ్యాము దురిత
తిమిర సంహారు లోకేశు దీన బంధు
ప్రాణికోటి నతి దయ గాపాడు వాని
సన్ను తింతును మమ్మిల సాకుకొరకు.                                                        4

బాల్యమునందె మారుతి దివాకరు బండుగ నెంచి పార కౌ
టిల్యము తోడ దేవపతి డింభకు వజ్రమువేగవేయ గా
మూల్యము నిచ్చె గాదె హను మున్విరుగన్ననిలాత్మజుండు వా
త్సల్యమునం బితామహుడు శస్త్రభయంబును బాపె వానికిన్.                              3

భారతావని కౌరవ పాండవ సమ
రమున విశ్వరూపము జూపి రాగ పాశ
జనిత మోహంబు నరునకు చక్రి బాప
పలుకు చున్నాడు పార్థుడు వందనములు.                             2

పడచు తనమునందు పరమభోగి పడుపు
పడతి గూడి పరువు బాసి విత్త
మెల్ల వెలతి కిచ్చి మేనలయమదము
వీడి నేటి యోగి వేమ నాయె.                                             1

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి