2, అక్టోబర్ 2015, శుక్రవారం

గాంధి మహాత్ముఁడు


సాహిం సోద్యమ తర్జితాంగ్ల జన సర్వాధీనతా భావ సం
దోహభ్రాజిత పుణ్య పూరుషుఁడు సద్యో వైభ వోద్యుక్తుఁడున్
బాహాబాహవి వైర భీత సుమహాజ్వాలావృతస్వాంత సం
దేహవ్రాత సుచోది తాపకృత నిర్దేశ్యుండు మా  గాంధియే                                                  2

ఆయుధమ్ము లేక యని దూషణలు లేకఁ
బోరు చలము మొక్క వోని జంకు
బొంకు లేని తాత పోరుబందరు గాంధి
భరత జాతి రత్న ప్రణతు లివియె                                                                1

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి