అభినందన మాల
|
|
వేద వాఙ్మయ కృషీవలుఁ డాచార్య మఱ్ఱి క్రిష్ణారెడ్డి.
|
|
|
|
|
|
|
చం. |
విదితము నీదు వాఙ్మయము విశ్వ జనాళికి విస్తృతమ్ముగా హృదయ వికాస కారక సహేతు పదాన్విత
భాసితం బిలన్
సదుచిత వేద భాష్య చయ సాధక! సాత్యవతేయ సన్నిభా!
సదమల కృష్ణ నామ విలసన్నుత మఱ్ఱి కులైక రత్నమా!
|
1.
|
|
|
|
|
|
చం. |
మృదు మధు రామృతాన్విత సమీరిత భాషణ దివ్య భూషణా వదన వికాస దీప్త సు
విభాసిత గాత్ర విలాస పూరుషా
సదుచిత వేద భాష్య చయ
సాధక! సాత్యవతేయ సన్నిభా!
సదమల కృష్ణ నామ
విలసన్నుత మఱ్ఱి కులైక రత్నమా!
|
2.
|
|
|
|
|
|
ఉ. |
ఆదరణీయ జీవితము నద్భుత రీతినిఁ బొంది తింపుగాఁ
బేదరికమ్ము గాంచ మిల విద్యల కంచును జాటి చెప్పితే
వేదము లందుఁ జూపితివి విస్తృత భక్తి ననన్య రీతినిన్
సాదర మొప్ప నిం దలఁతు
సన్నుత మఱ్ఱి కులైక రత్నమా!
|
3.
|
|
|
|
|
|
చం. |
పటుతర విద్యలం బడసి భావన సేయక కృచ్ఛ్ర రాశినిన్
వటు వయి వేద విద్యలను బన్నుగ నేర్చి గురుస్తవమ్మునన్
దిటవుగ నీ కుటుంబమును దీరుగ దిద్ది సరాగ పద్ధతిన్
వట తరు భంగిఁ బెంచితివి వంశము మఱ్ఱి కులైక రత్నమా!
|
4.
|
|
|
|
|
|
ఉ. |
చెన్నుగ శ్రీమఠ ప్రవర శ్రీ బస వేశుని సంశ్రయమ్మునం బన్నుగ సంస్కృతాధ్యయన పాఠము లభ్యసనమ్ము సేసి యా
సన్న వరప్రదుండు నిజ సద్గురుఁ డీయఁగ దేవ భాషనున్
సన్నుత విశ్వనాథు కడ శబ్దము నేర్చితి మఱ్ఱి రత్నమా!
[బసవేశుఁడు = బసవరాజస్వామి; వరప్రదుఁడు = వరదాచార్యులు; విశ్వనాథుఁడు
= విశ్వనాథ శర్మ]
|
5.
|
|
|
|
|
|
ఉ. |
వేదము లిద్ధరన్ శ్రుతుల పేరఁ జెలంగెను దాఱుమాఱుగన్
వేదము లుద్ధరింపఁబడె వెన్నుని చేతఁ బురాతనమ్మునన్
వేదము లెల్లఁ గూర్చఁబడె వేద విదుం డగు వ్యాసు చేతనున్
వేదము వ్రాసి తాంధ్రమున విజ్ఞుఁడ మఱ్ఱి కులైక రత్నమా!
|
6.
|
|
|
|
|
|
ఉ. |
వేద చతుష్ట యాంతర విభిన్న మహోన్నత మంత్ర పంక్తినిన్
స్వేద విహీన లీలఁగఁ బవిత్ర పుటమ్ములు నాల్గు వేలలోఁ
బాదుకొనంగఁ జేసితివి పండిత పామరు లెల్ల మెచ్చఁగా
వేద విదుండవై సతము వెల్గెదు మఱ్ఱి కులైక రత్నమా!
|
7.
|
|
|
|
|
|
చం. |
పదపడి నాల్గు వేదముల భాష్యము నాంధ్రము నందు వ్రాసితే
యదరక ద్వాదశ ద్వయ సహస్ర పుటమ్ముల నింపి యింపుగం
బదునగు యౌవనమ్ముననె పాత్రత నెంచఁగ శంక రాభమై
చదువుల తల్లి నిన్ను గనె సద్దయ మఱ్ఱి కులైక రత్నమా!
|
8.
|
|
|
|
|
|
ఉ. |
వారని భక్తిఁ గొల్చితివి పన్నుగ నీ విల వేద మాతనుం
గారణ జన్మ మందితివి కైటభ మర్దనుఁ డిచ్చు గావుతం
బార మెఱుంగ నేరని యపార కృపారస వీక్షణమ్ములన్
భారత దేశ రత్నముగ భాసిలు మఱ్ఱి కులైక రత్నమా!
|
9.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి