ఋతు సంహారము, శరదృతువు
(మూలము కాళిదాస ప్రణీతము)
పంచ పద్య ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.
|
ఉ. |
శ్రీ శర వాస భాసితము
సిద్ధ జలేజ వరాస్య కాంతితో నాశఁ జరించు
హంస రట నాంచిత నూపుర రావ యుక్తమై యాశలఁ బక్వ
శాలి రమ ణానత గాత్ర విలాస లీలతో దేశమునన్ శర ల్లలన
తేలెను నూత్న వధూటి భంగినిన్ |
1.
|
|
|
|
|
|
ఉ. |
ఱెల్లు వనమ్ము నేల నిసి ఱేఁడు నిశీధిని నంచ మూకలే చల్లని యేటి నీటి నిఁకఁ జక్కని కల్వలు నా
సరస్సులన్ మల్లెలు పూల తోటలను మాలతి పూవు లరంటి కానలం దెల్లగఁ జేసె నింపుగను దివ్యపు శారద వేళఁ
గాంచఁగన్ |
2.
|
|
|
|
|
|
చం. |
ఎగిరెడు మీల గుంపుఁ గన నింతుల కాంచన మేఖ లాభమై ఖగములు చెంత నిల్వఁ దగ కాంతల హార నిభమ్ము తోఁపఁగా మగువల శ్రోణులన్ గెలుచు మందపు సైకత మండలమ్ములం దగ నదు లెల్ల మెల్లఁగ మదమ్మునఁ జాగఁగఁ బోలెఁ బోటులన్ |
3.
|
|
|
|
|
|
ఉ. |
నాకము వెండి వెండియు మృణాళము శంఖము భంగిఁ
దెల్లఁగా సోకి జలక్ష యాభ్రములు చూడఁగఁ దేలిక యౌచుఁ
బాఱఁగన్ వీఁకఁ జెలంగి మారుతము వీవఁగఁ గన్పడెఁ
జామరమ్ములం బ్రాకట రీతి వీవఁ బడు పార్థివ సింహము భంగి
భాసిలన్ |
4.
|
|
|
|
|
|
ఉ. |
కానఁగ నూఱి నట్టి యగు కాటుక కాంతి వెలుంగు
నింగినిన్ మానుగ నెఱ్ఱ రం గలరు మంకెన పుష్పము లున్న
భూమినిన్ సానువు లందు భాసిలెడు సారస సంచయ యుక్త
భూములన్ మే నలరంగ నుత్కలిక మీఱ మనమ్మున నుండ రే
యువల్ |
5.
|
15/2/2021.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి