శ్రీ యశస్వినీ శతకము.
పద్యదశకము.
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
|
|
విశ్వ రక్షణమునకై శ్రీలలితా దేవిని,
దేవి మహిమము తక్క యన్య శరణ్యము లేదని యెంచి, యా మహిమము
చూపు మని వేఁడుకొనుట.
|
|
|
|
|
|
|
ఉ. |
శ్రీయుత
మాన వేంద్రులకుఁ జెల్లును మత్తున నేమి చేసినం
గాయము
వంచి కష్ట పడు కార్మిక కోటికిఁ గడ్పు మంటయే
ప్రాయ
మడంగి నట్టి జన వర్గపుఁ బాటులు మిక్కుటమ్ములే
న్యాయమె
చూపుమీ మహిమ నందిత మేదిని! శ్రీయశస్వినీ!
|
1.
|
|
|
|
|
|
ఉ. |
నీతి
విహీనమై కర మనీతి సెలంగె దురాశలే మనః
ప్రీతి
నొసంగఁ జాగె నిరపేక్షము ధర్మము నందు హెచ్చిలెం
జూత
మనంగ మానవత శూన్యము భారత మందు నిత్తఱిన్
మాతరొ
చూపుమీ మహిమ మంగళ దాయిని! శ్రీయశస్వినీ!
|
2.
|
|
|
|
|
|
ఉ. |
వంచన
నిత్య కృత్య మయి పండిత పామర భేద హీనమై
మించెను
భూతలమ్మునను మృగ్యము నిక్కపు టార్జవం బిఁకన్
సంచులు
నింప విత్తముల సర్వులు వొందిరి నైపుణమ్ము వీ
క్షించుచు
చూపుమీ మహిమ శ్రీకరి! శాంకరి! శ్రీయశస్వినీ!
|
3.
|
|
|
|
|
|
చం. |
నరులకు
నెల్ల నక్కట సనాతన ధర్మము రోఁత యయ్యెనే
పరఁగెను
స్వేచ్ఛ మిక్కుటము పశ్చిమ సంస్కృతి భంగి నెల్లెడన్
గురువుల
పైన నాదరము గూలె సమూలము స్వార్థ చింతలం
గరుణను
జూపుమీ మహిమ కాలిక! కేవల! శ్రీయశస్వినీ!
|
4.
|
|
|
|
|
|
ఉ. |
నారుల
పైన గౌరవము నాశన మయ్యెను భూతలమ్మునన్
వారికి
లేదు రక్షణము భైరవ కాముక కోటి కృత్యముల్
మూర
నవారితమ్ముగ నపూర్వపు రీతిని సంతతమ్మునున్
వారక
చూపుమీ మహిమ భైరవి! శాంభవి! శ్రీయశస్వినీ!
|
5.
|
|
|
|
|
|
ఉ. |
మూర్తుల
నిల్పి భక్తుల సమూహము నుండి హరించి కాసులన్
నేర్తు
రుపన్యసింపఁగ ననేక విధమ్ముల భక్తి బోధలే
యార్తుల
నన్న హీనుల నిరాదరణమ్మున గాంత్రు సంతతం
బార్తినిఁ
జూపుమీ మహిమ నమ్మరొ రంజని! శ్రీయశస్వినీ!
|
6.
|
|
|
|
|
|
ఉ. |
నేర్చిరి
పెక్కు శాస్త్రములు నేర్చిరి వింతగ విశ్వజాలముల్ గూర్చిరి
గోళ యానములు గూర్చిరి దేశ సమూహ సంస్థలం
గూర్చిరి
మార ణాయుధ నిగూఢ బలమ్ములఁ గైతవమ్మునం
బేర్చుచుఁ
జూపుమీ మహిమ విశ్వవినోదిని! శ్రీయశస్వినీ!
|
7.
|
|
|
|
|
|
చం. |
మతములు
సంక్రమించినవి మానవ జాతికి వేఱు వేఱుగా నితనికి
దైవ మాతని కనిష్టుఁడ యాతని వేల్పు వీనికిన్
సతతము
భేద భావముల శాంతి వినాశము గాఁగఁ బోరులన్
వితతిగఁ
జూపుమీ మహిమఁ బేరిమి బ్రాహ్మణి! శ్రీయశస్వినీ!
|
8.
|
|
|
|
|
|
చం. |
విలువలు
సన్నగిల్లినవి విద్యల నీర్ష్యలు ప్రజ్వలించెనే
చెలఁగెను
గక్ష లాటలను జిత్ర విచిత్ర విధమ్ములన్ ధరన్
మలినము
లయ్యె లోకమున మానసముల్ నర కోటి కక్కటా
వలపునఁ
జూపుమీ మహిమ పన్నుగఁ బార్వతి! శ్రీయశస్వినీ!
|
9.
|
|
|
|
|
|
ఉ. |
సత్యము
కాన రా దిల నసత్యము నిచ్చలు పిచ్చలించెనే
యత్యయ
మెల్ల తావుల విహారము సేయఁ దొడంగె మిక్కిలిన్
నృత్యము
లాడు నిత్యమును నేరము లిచ్చట కుప్ప కుప్పలై
స్తుత్యము సూపుమీ మహిమ తోరము ధర్మిణి! శ్రీయశస్వినీ!
|
10. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి