8, ఫిబ్రవరి 2023, బుధవారం

Sahiti Bandhu Snmana Sanchika

 

సాహితీ బంధు సన్మాన సంచిక.
( శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ సన్మాన సందర్భము)

 

 

ఆంధ్ర సాహితీ కృషీవలుఁడు.

 

 

 

 

ఉ.

పండిత వంశ సంభవుఁ డపార మృదూక్తి వివిక్త వక్త్రుఁడున్
మండిత గాత్ర వర్తనుఁడు మాన్య విధేయుఁడు పండితార్యుఁడున్
మండల కార్య భారక సమంచిత ధుర్యుఁడు బాల షణ్ము ఖా
ఖండ సుశర్మ సంజ్ఞుఁడు మృకండు నిభ ద్విజ వర్యుఁ డిద్ధరన్

1.      

 

 

 

కం.

స దనంతచ్ఛం దాది సు
విద సందోహస్థ జాల వేశ్మ సు సృక్స
మ్మద కార్య ధురంధర త
త్సదన నివాస గురు నిభుఁడు శర్మాఖ్యుండే    

2.     

 

 

 

చం.

శతక కదంబ చోదక లసన్మణి  కావ్య గ జాంకుశుండు నం
చిత రచనా పరంపర విశేష విశోధన తత్పరుండు సం
తత గురు పాద సేవకుఁడు ధార్మిక చిత్తుఁడు నిర్మ లేద్ధ శాం
త తరళ సచ్ఛరిత్రుఁడు స దార సుతావళి వృద్ధి చెందుతన్     

3.     

 

 

 

మ. 

వినయజ్ఞుండు వివేకవంతుఁడును దోపెల్లాన్వ యోద్ధారుఁడున్  

జిన లక్ష్మీయుత పార్వతీ శివుల దాక్షి ణ్యేక్షణ శ్రేణినిన్
ఘన భోగావలి పుత్ర పౌత్ర విమల గ్రా మాయు రారోగ్యముల్  
ధన ధాన్యాదుల సాహితీ జన లసద్బంధుండు వర్ధిల్లెడిన్  

4.     




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి