|
|
ఆంధ్ర మహాకవయిత్రి శ్రీమతి
జయలక్ష్మీమాత శత జయంతి సందర్భమున సమర్పించు నమః ప్రసూన షష్ఠ్యంతములు. |
|
|
|
|
|
|
ఉ. |
మాతకు వందనమ్ములు సమర్చిత భాషకుఁ దెన్గు త్రాతకున్ వ్రాతలఁ దెల్గు తేనె లిడు వాక్కవితా ప్రతిమా మతల్లికిన్ భాతివ దాత్మసంచలిత వాగ్వనితా మణికిన్ మహా కవి వ్రాత నమస్సు లందు జయ లక్ష్మి యనంగ వెలుంగు ద్యోతకున్ |
1.
|
|
|
|
|
|
ఉ. |
నారుల సాటి
లేని వర నారికి సత్కవి పూజ లందు దే వేరికి నాటి
యాంధ్రమునఁ బెన్కవయిత్రికిఁ గావ్య లక్య్మికిన్ వారక పెక్కు
గ్రంధములు వ్రాసిన నాతికిఁ బూజ్య మాతకుం గూరిమి
వేంకటేశ్వరునిఁ గొల్చిన సన్నుత వృద్ధ మాతకున్ |
2.
|
|
|
|
|
|
కం. |
పరిశుద్ధ చేతనకు వా క్పరంపరా నిపుణ కాంధ్ర కవయిత్రికి
భా సుర రచనా విలసితకున్ వరాంధ్రభాషా వన సుర పాదపమునకున్ |
3.
|
|
|
|
|
|
కం. |
ద్రావిడ ధరోద్భవకు ని త్యావిరళ మహాంధ్ర పద విహారిణికిన్ స ద్భావైక కథా కర్తకు సేవిత వాణికి సతికి విశిష్ట జననికిన్ |
4.
|
|
|
|
|
|
కం. |
ఆరాధిత గీర్దేవికిఁ తారా నిభ కాంతిమతికి ధాత్రీ క్షమకున్ పారావార సమాన గ భీర నిజాంతఃకరణకు విద్యారతికిన్ |
5.
|
|
|
|
|
|
కం. |
సహజ కవితా విరాజిని కి హత నిజోద్ధతికి సుప్రకీర్తిత సతికిన్ విహిత నియ మాచరణకు న పహృత విబుధజన హృదికి నపర గీష్పతికిన్ |
6.
|
|
|
|
|
|
|
పోచిరాజు కామేశ్వర రావు. 8602787525. 5 Feb. 2023. |
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి