|
|
సత్యధర్మేశ్వరా
శతకము (పంచపద్యములు) ప్రణీతము పోచిరాజు కామేశ్వర
రావు. |
|
|
|
|
|
|
మ. |
సుర భట్టారక సంచయ ప్రమథ సచ్ఛూరార్చ్య సర్వేశ్వరా! వర శైలాలయ! పార్వతీ సువిలసద్వామాంగ! గంగాధరా! కరి భృత్యోచిత చర్మ చేల కటి! నాగశ్రేష్ఠ సద్భూషణా! హర! లింగేశ్వర! శంకరా!సుజన రక్షా! సత్యధర్మేశ్వరా! |
1.
|
|
|
|
|
|
మ. |
అరవిందాసన సేవ్యమాన! దశకం ఠారాధ నానందితా! గురు శుక్రార్చిత! నారదాది ముని చక్షుప్రీతి దాయీశ్వరా! నర సంఘార్చిత తృప్త చిత్త! ఫణి సన్నాగేంద్ర లూతావనా! హర! లింగేశ్వర! శంకరా!సుజన రక్షా! సత్యధర్మేశ్వరా! |
2.
|
|
|
|
|
|
మ. |
పరమేశా! రఘు రామ దీర్ఘతర దోః పద్మార్చ్యమానా! శివా! గరళగ్రీవ! ఖరాసమాక్ష! వరదిగ్శాటీ! భవానీపతీ! పుర సంఘాత వినాశ కారక! లసద్భోగీంద్ర భూషావళీ! హర! లింగేశ్వర! శంకరా!సుజన రక్షా! సత్యధర్మేశ్వరా! |
3.
|
|
|
|
|
|
మ. |
పరముం దల్చి యిహమ్ములోఁ దమి భవ త్ప్రఖ్యాత నామమ్ము లె వ్వరు నిత్యమ్ము పఠింతురో దలఁతురో వారెల్లరున్ సౌఖ్యముల్ ధరలోఁ బొంది తరించి సత్య పదమున్ దర్శించి జీవింపరే హర! లింగేశ్వర! శంకరా! సుజన రక్షా! సత్య ధర్మేశ్వరా! |
4.
|
|
|
|
|
|
శా. |
ఆలిం గూడితి వామ దేహమున మూ ర్ధావాసయౌ గంగయున్ హాలాహాలము కంఠమం దిడితివే యా నెత్తినిం జంద్రునిం జాలుం జాలును నీదు వింత లిఁక ద్రాక్షారామ భీమేశ్వరా హా! లింగేశ్వర! శంకరా! సుజన రక్షా! సత్య ధర్మేశ్వరా! |
5.
|
ప్రబల రచనా ధురంధర | నిబిడీ కృత మోద భరిత నిర్మల చిత్తున్ || స్తబక నిభ కవన చయ రత | విబుధ వర విధేయ సత్కవి జనాసక్తున్ ||
8, ఫిబ్రవరి 2023, బుధవారం
Satya Dharmeswra Satakamu
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి